Oct 18,2020 22:20

లంకగ్రామాల్లో పర్యటనలో డి రమాదేవి తదితరులు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి రమాదేవి - లంక గ్రామాల్లో పర్యటించిన సిపిఎం బృందం
భట్టిప్రోలు : వరద నీరు ప్రాజెక్టులు నిండేంత వరకు దిగువకు విడుదల చేయకుండా ఒక్కసారిగా వదలడంతోనే లంకగ్రామలు ముంపునకు గురయ్యాయని, ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవటమే కారణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి తెలిపారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో వరద ముంపునకు గురైన లంకగ్రామలలో ఆది వారం రమాదేవి, జిల్లా నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా రమాదేవి పోతార్లంక, తిప్పలకట్ట, కిస్కిందపాలెం, చింతమోటు, పెదలంక, పెసర్లంక గ్రామాలలో రైతులు, కూలీలతో మాట్లాడి వారు ఏదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత కొన్నిరోజులుగా ఉపాధి లేక అల్లాడుతున్నామని, తాగునీరు కూడా సక్రమంగా అందటంలేదని భాదితులు రమాదేవి ఎదుట వాపోయారు. వాటర్‌ ప్యాకెట్లు తప్ప నీరు సక్రమంగా సరఫరా కావటం లేదని గృహాలు మునిగి సామానులు తడిచి నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రైతులు కూడా తాము లక్షలు వెచ్చించి సాగుచేసిన వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని బృందం ఎదుట వారి బాధలను వెలిబుచ్చారు. రమాదేవి మాట్లాడుతూ కురిసిన వర్షాలు, వచ్చే వరదనీరు, ఎంతమేర వచ్చే పరిస్థితి ఉంది అన్న విషయాలు ముందుగానే అంచనా వేసి దాని లెక్కల ప్రకారం విడుదల చేస్తే నేడు రైతులు ఇబ్బందులు పడేవారు కాదని దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. లంకగ్రామలలో మురుగు నీటి పారుదల సౌకర్యం సక్రమంగా లేకపో వటం కూడా పంటల ముంపుకు ప్రధాన కారణ మన్నారు. లంకగ్రామలలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 50 వేలు చొప్పున ప్రభుత్వం నష్టపరి హారం అందించాలని, ముంపుకు గురైన ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్ధిక సహాయం, నిత్యావసర సరుకులు అందించాలని ఆమె డిమా ండ్‌ చేశారు. కొల్లూరు మండలం ఆవులవారి పాలెంలో వరద ప్రవా హంలో కొట్టుకు పోయిన శంకరరావు మృతి అది óకారుల నిర్లక్ష్యమేనని విమ ర్శించారు. మృతుని కుటుంబ సభ్యులను పరా మర్శించారు.కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి కృష్ణమోహన్‌, జి సుధాకర్‌, ఎం సత్యన్నారాయణ, కె.సురేష్‌, పి నాగ మల్లేశ్వరరావు, సుబ్బారావు, బి.ఎల్‌.కె ప్రసాద్‌, దీపాల సత్యన్నారాయణ పాల్గొన్నారు.
మురుగు సమస్య జెసి దృష్టికి
లంకగ్రామలలో వరదనీరు, వర్షపునీరు బయటికి వెళ్ళేమార్గం లేక పంటలు దెబ్బతింటు న్నాయని ప్రస్తుత వరద నీరు ఉన్నప్పుడే అధికారులు పరిశీలిస్తే సమస్య అర్ధమౌతుందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని రమాదేవి జాయింట్‌ కలెక్టర్‌తో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని జె సి హామీ నిచ్చారు. రైతులు పార్టీలకు అతీతంగా పోతాడితేనే మురుగునీటి పారుదల సమస్య పరిష్కారం కాగలదని రమాదేవి రైతులకు సూచించారు.