
ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డిఒ శీనానాయక్
అధికారులపై ఆర్డిఒ ఆగ్రహం
ప్రజాశక్తి-దగదర్తి : సచివాలయం సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో కావలి ఆర్డిఒ శీను నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ విధులు నిర్వహిస్తున్నట్లు సంతకం చేసి, సొంత పనులకు వెళ్లడంతో పక్కన ఉన్న ఎంపిడిఒకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జగనన్న కాలనీ లేఅవుట్లు సంబంధించి కోర్టు వివాదాలు మండలంలోని కాట్రయపాడు, చెన్నూరు, దుండిగం, పెద్ద పుత్రుడు, లక్ష్మీ నారాయణపురం, బ్యాట్సన్పేట, సున్నపు బిట్టి, దక్షిణ మిట్టా, తురిమెల్ల గ్రామాల్లో పర్యటించారు. అనంతరం చెన్నూరు, కేకే గుంట, సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం సంబంధించిన అధికారులు ఉద్యోగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. వాలంటీర్ల్లు తప్పనిసరిగా సచివాలయంలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దారు ప్రమీల, ఎంపిడిఒ శ్రీదేవి, కార్యదర్శి దుర్గా, తదితరులు పాల్గొన్నారు.