Jun 02,2023 00:05

మాట్లాడుతున్న జడ్‌పిటిసి తిరుపతి రెడ్డి

ప్రజాశక్తి-వెలిగండ్ల : మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడం సరి కాదని జడ్‌పిటిసి గుంటక తిరుపతిరెడ్డి అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి రామన మహాలక్ష్మమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశానికి అధికారులు హాజరు కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు లేకుండా సమస్యల గురించి ఎవరితో చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ తాతపూడి సుకుమార్‌, వైస్‌ఎంపిపి తాతపూడి మేరీ పుష్ప, సింగిల్‌ విండో అధ్యక్షుడు కాకర్ల వెంకటేశ్వర్లు, మాజీ జడ్‌పిటిసి రామన తిరుపతిరెడ్డి, నాగూర్‌ యాదవ్‌, జార్జ్‌ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు దేవసహాయం, సచివాలయ కన్వీనర్‌ పొల్లా సుబ్రమణ్యం, సర్పంచులు సురేష్‌బాబు, శ్యామల కష్ణారెడ్డి, కటికల రిబ్కా, గోన సుదర్శన్‌, ఎంపిటిసిలు గిద్ద తిరుపతమ్మ, కటకల వెంకటరత్నం, ఎలుక రమణయ్య, గోన జేమ్స్‌, గంజి రవీంద్రారెడ్డి, పాణ్యం మురళి తదితరులు పాల్గొన్నారు.