Sep 22,2022 12:59

లక్నో :   జ్ఞానవాపి కేసుపై వారణాసి సీనియర్‌ జడ్జి గురువారం విచారణ చేపట్టనున్నారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఉన్న హిందూ దేవతలకు పూజలు చేసేందుకు అవకాశం కల్పించాలంటూ ఐదుగురు హిందూ మహిళల పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. పిటిషనర్లు మసీదును దేవాలయంగా మార్చాలని కోరడం లేదని, కానీ వివాదాస్పద మసీదులో ఏడాది పొడవునా పూజించేందుకు హక్కు కల్పించాలని కోరుతున్నారని సెప్టెంబర్‌ 12 ఇచ్చిన ఈ ఉత్తర్వుల్లో వారణాసి కోర్టు పేర్కొంది. 1991 చట్ట ప్రకారం.. ఆగస్ట్‌ 15, 1947లో ఉన్న విధంగానే ప్రార్థనా స్థలాలను అనుమతించాలని అన్నారు. అయితే బాబ్రీ మసీదు కేసు ఇందుకు మినహాయింపు అని ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం. మసీదు యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.