May 04,2021 09:49

మర్రిపాడు (నెల్లూరు) : ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పొంగూరు కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని, కారు ఢీకొంది. ప్రమాదానికి గురైన కారు వెనుక వస్తున్న మరో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని ఆత్మకూరు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.