Nov 25,2022 15:57

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండలంలోని అంగర ఎస్ఐగా జి చంటి నియమితులయ్యారు. ఈయన రావులపాలెం ఎస్ ఐ గా పని చేసి బదిలీపై కపిలేశ్వరపురం మండల అంగర ఎస్ ఐ గా వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పని చేసిన ఎస్ ఐ సంపత్ కుమార్ అమలాపురం బదిలీపై వెళ్లారు. ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన చంటి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్ ఐ చంటిని కపిలేశ్వరపురం, తాతపూడి, ఎంపీటీసీలు తదితరులు, మర్యాదపూర్వకంగా కలసి ఆయనకు పూలమాలలు, సాలువాలు కప్పి, శుభాకాంక్షలు తెలిపారు.