May 17,2022 23:34

ఫొటో : మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి
ఐఎఎస్‌, ఐపిఎస్‌లను చూస్తుంటే జాలేస్తుంది..
- మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్య
ప్రజాశక్తి-ముత్తుకూరు : రాష్ట్రంలో పని చేస్తున్న ఐఎఎస్‌, ఐపిఎస్‌లను చూస్తుంటే జాలివేస్తుందని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ భ్యురో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. పెంచిన ధరలపై టిడిపి చేపట్టిన బాదుడే..బాదుడే కార్యక్రమం మంగళవారం పొట్టెం పాడు గ్రామంలో నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి వచ్చినా సోమిరెడ్డి కి టిడిపి నాయకులు పార్లపల్లి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతీ ఇంటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్టాన్ని ఇన్ని ప్రభుత్వాలు, ఇంత మంది ముఖ్యమంత్రులు పరిపాలించినా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు.
రాష్ట్రంలో ప్రతీరోజూ ఏదొక ప్రాంతంలో అధికారులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే చేయని తప్పులకు టిడిపి నాయకులపై కేసులు పెట్టే పోలీసులు, వైసిపి నాయకులను చూసి భయపడుతున్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి, టిడిపి నాయకులు నీలం మల్లికార్జున, మునిరెడ్డి, అల్లిముత్తు, దండు శ్రీనివాసులు, ఆరెద్దుల శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.