Jul 28,2021 20:25

ఐసిఐసిఐ లంబార్డ్‌ వెల్లడి
హైదరాబాద్‌ :
డాక్టర్‌ రెడ్డీస్‌ అనుబంధ సంస్థ 'స్వాస్‌ వెల్‌నెస్‌'కు చెందిన వైద్య నిపుణుల నెట్‌వర్క్స్‌తో పాటు తమ సంస్థ ఆఫర్‌ చేసిన ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ 'ఐఎల్‌ టేక్‌కేర్‌' అప్లికేషన్‌ ద్వారా దేశంలోనే తొలిసారి నగదు రహిత ఔట్‌ పేషంట్‌ సేవలను అందిస్తున్నట్లు ఐసిఐసిఐ లాంబార్డ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఔట్‌ పేషంట్‌ హెల్త్‌ కేర్‌ రంగంలో డాక్టర్‌ కన్సల్టేషన్స్‌, పాథలాజీ లేబరేటరీస్‌, డయాగస్టిక్‌ సేవలు, ఫార్మసీలు, ఇన్సూరెన్స్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నట్లు పేర్కొంది. తొలుత ఈ సేవలను హైదరాబాద్‌, విశాఖపట్టణం నగరాల్లో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.