Mar 18,2023 22:45
  • డిమాండ్లపై ఎట్టకేలకు దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్‌
  • మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు హామీ
  • ఉద్యమం వాయిదా
  • ఈ విజయం అంబో జాదవ్‌కు అంకితం: రైతు నేతలు
  • ఎఐకెఎస్‌ అభినందనలు

ముంబయి : రైతుల లాంగ్‌మార్చ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. నాసిక్‌ నుంచి ముంబయి వరకు పాదాలు బబ్బలెక్కి, నెత్తురోడుతున్నా లెక్కచేయక కదం తొక్కుతూ అయిదు రోజులు ఏక రీతిన సాగిన ఈ రైతు యాత్రకు మహా విజయం లభించింది. రైతుల డిమాండ్లను ఒప్పుకుంటున్నట్లు రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. దీంతో అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) నేతలు తమ కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ను ముగించి, ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్టు శనివారం నాడిక్కడి వసింద్‌లోని ఈద్గా మైదాన్‌లో జరిగిన బహిరంగ సభలో రైతు నేత జెపి గవిట్‌ ప్రకటించారు. ఇది రైతుల విజయమని ఆయన అన్నారు. లాంగ్‌మార్చ్‌లో పాల్గని అసువులు బాసిన నాసిక్‌లోని దిండోరికి సమీప గ్రామానికి చెందిన 58 ఏళ్ల రైతు పాండలిక్‌ అంబో జాదవ్‌కు ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని రైతు నాయకులు ప్రకటించారు. జాదవ్‌ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే రూ.5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. రైతుల డిమాండ్లన్నిటినీ ప్రభుత్వం ఆమోదించిందని గవిట్‌ చెప్పారు. పాలనా సంబంధమైన కొన్ని అంశాల కోసం ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రైతుల డిమాండ్లను ఎలా నెరవేర్చాలను అంశానికి సంబంధించి నిర్దిష్ట కాలపరిమితిలో కమిటీ తన నివేదికను ఇవ్వాల్సి వుంది. గతంలో రైతాంగ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయతిుంచిన ప్రభుత్వం కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ బలానిు చూసి రైతులతో మాట్లాడేందుకు ముందుకు వచ్చారని గవిట్‌ పేర్కొన్నారు. ''మా డిమాండ్లను ఆమోదించినందుకు వారికి మా కృతజ్ఞతలు.'' అని ఆయన తెలిపారు. రైతులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా వసింద్‌ నుంచి నాసిక్‌కు ప్రత్యేక రైలును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎఐకెఎస్‌ పట్ల రైతులకు పూర్తి విశ్వాసం వుందని రైతాంగ నేత జితేంద్ర చోప్డే వ్యాఖ్యానించారు. ''విజయం సాధించిన తర్వాతనే మేం వసింద్‌ నుంచి తిరిగి వెళుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం మమ్మల్ని మోసగించాలని చూసినట్లైతే, ఆరు మాసాల తర్వాత మరింత పెద్ద సంఖ్యలో తిరిగి ఇక్కడకు వస్తాం.'' అని చెప్పారు.
కార్మిక నేత, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు బిఎల్‌ కరద్‌ కూడా లాంగ్‌ మార్చ్‌లో, ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ''రైతాంగ డిమాండ్లతో పాటుగా, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల చొరవలను చేపట్టింది. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం కింద రూ.1500 పెంచుతామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ వర్కర్లకు ఇకపై వారి బ్యాంక్‌ ఖాతాల్లోనే నేరుగా జీతాలు పడతాయి.'' అని కరద్‌ చెప్పారు. ఇవన్నీ రాష్ట్ర స్థాయి డిమాండ్లని అన్నారు. ఇంకా పెద్ద సమస్యలు వున్నాయన్నారు. ''ఆ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్‌ 5న కార్మికులు, రైతులు దేశ రాజధానిని చుట్టుముడతారు. మహారాష్ట్రకి చెందిన దాదాపు 15వేల మంది రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ఇందులో పాల్గంటారు. దానికోసం మేము సన్నద్ధమవుతున్నాం. టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నాం. గ్రామ స్థాయి, బ్లాక్‌ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాం.'' అని చెప్పారు.

  • మంత్రివర్గ సంఘం ఏర్పాటు, ఉల్లి రైతులకు క్వింటాకు రూ.350 చొప్పున ఆర్థిక సాయం : సిఎం షిండే

రైతుల డిమాండ్లను ఆమోదించడంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ, రైతుల 14పాయింట్ల డిమాండ్ల పత్రంపై రైతాంగ ప్రతినిధులతో చర్చలు జరిపామని తెలిపారు. డిమాండ్లతోపాటు అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన డిమాండ్లు, ఆలయ ట్రస్టీలు, బీడు భూములను రైతులకు బదిలీ చేయడం, తదితర అంశాలపైనా చర్చించినట్లు చెప్పారు. అకాల వర్షాలు, తక్కువ ధరల కారణంగా ఉల్లి రైతులు నష్టాలను ఎదుర్కొన్నారని, వారికి క్వింటాల్‌కురూ.350 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రైతుల అతిపెద్ద డిమాండ్‌పై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుల ఆధీనంలోని నాలుగు హెక్టార్ల వరకుగల అటవీభూమికి సంబంధించిన డిమాండ్‌పై కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు. నెల రోజుల్లోగా కమిటీ తన నివేదికను సిద్ధం చేస్తుందని, అటవీ హక్కుల చట్టం కింద పెండింగ్‌లో వును అంశాలను పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఆ కమిటీలో మాజీ ఎంఎల్‌ఎ గవిట్‌, సిపిఎం సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వినోద్‌ నికొలారు వుంటారు. రైతులు తమ ఉద్యమాన్ని ఆపాలని షిండె కోరారు.

  • సుదీర్ఘ పోరుకు రైతులు సన్నద్ధం

రెండు రోజులుగా ముంబయి శివార్లలోని వసింద్‌ వద్ద కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌కు రైతులు విరామం ఇచ్చారు. ముంబయిలో ప్రవేశించడానికి ముందు నాసిక్‌-ముంబయి హైవేపై తాత్కాలికంగా శిబిరాలు వేసుకుని ఉన్నారు. ఈ నెల 12న నాసిక్‌ నుంచి లాంగ్‌ మార్చ్‌ ప్రారంభమై 16వ తేదిన వసింద్‌లోని ఈద్గా మైదాన్‌కు చేరుకుంది.

  • సాగు చేసే భూమి మాదే

తాము సాగు చేసే భూమిపై యాజమాన్య హక్కుల కోసం రెండు తరాల వారు పోరాడుతూ మరణించారని, ఇప్పుడు నా పిల్లలు కూడా అలా పోరాడుతూ చనిపోవాలని తాను కోరుకోవడం లేదని, అందువల్ల ఈ పోరాటం చాలా కీలకమైనదని రైతు సుఖ్‌రాం పవార్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇది ఒక్క పవార్‌ డిమాండ్‌ కాదు, సాగు చేసుకుంటును అటవీ భూములపై హక్కు తమకే ఇవ్వాలని కోరుతున్న వేలాదిమంది గిరిజన రైతుల డిమాండ్‌ ఇది.
ఈద్గా మైదాన్‌లో చేసిన ఏర్పాట్లు చూస్తే ఢిల్లీ సరిహద్దుల్లో ఆనాడు రైతులు చేసిన మహత్తర పోరాటం గుర్తుకువస్తోంది. వంట చేసుకోవడానికి అవసరమైన వంట చెరకు, ఆహార పదార్థాలతోసహా సర్వం తమతో తెచ్చుకునాురు. వేల కిలోమీటర్ల మేర నడిచి బృందాలుగా వచ్చిన వారిలో వృద్ధులు, మహిళలు కూడా వునాురు. ప్రదర్శన సందర్భంగా అనేక స్వచ్ఛంద సంస్థలు, పౌర ప్రముఖులు రైతులకుసహాయం చేశారు. వందలాదిమంది విద్యార్ధులు కూడా సహాయక చర్యల్లో పాల్గనాురు.

  • ఎఐకెఎస్‌ అభినందనలు

కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ను విజయవంతం చేసిన మహారాష్ట్ర రైతాంగానికి ఎఐకెఎస్‌ అభినందనలు తెలియజేసింది. ఉల్లి, పత్తి, సోయాబీన్‌, తుర్‌ దాల్‌, పెసలు, పాలు తదితరాలకు ప్రోత్సాహక ధరలు అందించాలను డిమాండ్‌తో సహా మొత్తంగా 15 డిమాండ్లపై ఈ ఆందోళన సాగింది. అటవీ హక్కుల చట్టానిు అమలు చేయాలని కోరుతూ ఆదివాసీ రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రుణాల రద్దు, విద్యుత్‌, పంటల బీమా, వృద్ధాప్య పింఛన్ల పెంపు, స్కీమ్‌ వర్కర్ల వేతనాలు ఇలా పలు డిమాండ్లపై వారి ఆందోళన సాగింది. 2018లో ఢిల్లీ సరిహద్దులో ఎఐకెఎస్‌ నేతృత్వంలో సాగిన రైతాంగ ఉద్యమం తరహాలోనే 2023లో కూడా నిరుపేద రైతాంగం, ఆదివాసీల డిమాండ్లను ఎస్‌ఎస్‌-బిజెపి ప్రభుత్వం ఆమోదించాల్సి వచ్చింది. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా సాగే ప్రగతిశీల ఉద్యమాలకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని ఎఐకెఎస్‌ పేర్కొంది. రాబోయే పోరాటాల్లో మరింత పెద్ద సంఖ్యలో కార్మికులు, రైతాంగం పాల్గనేలా ఉత్సాహాన్నిస్తుందని తెలిపింది.