Sep 15,2021 23:58

ఐలమ్మ చిత్రపటానికి నాయకుల నివాళి

ఒంగోలు కలెక్టరేట్‌ : వీర నారి చాకలి ఐలమ్మకు రజక వృత్తిదారుల సంఘం నేతలు ఘనంగా నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి సభ స్థానిక ఎల్‌జిబి భవన్‌లో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. సభకు కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.కొండయ్య మాట్లా డారు. విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన సత్తెనపల్లి రామకృష్ణకు నివాళులర్పించారు. కార్యక్రమంలో చీమకుర్తి కోటేశ్వరరావు, రమణమ్మ, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.