Aug 09,2022 20:02

న్యూఢిల్లీ  :  ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆగస్టులోనే 5జి సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కాగా.. 2024 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా అన్ని పట్టణాలు, కీలకమైన గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. కాగా.. ప్రస్తుత టారీప్‌లను కూడా పెంచనున్నట్లు ఆ కంపెనీ ఎండి, సిఇఒ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. ప్రస్తుతం ప్రతీ వినియోగదారుడి నుంచి సగటున రూ.183 ఆదాయం వస్తోందని.. ఇది త్వరలోనే రూ.200కు చేరొచ్చని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇది రూ.300కు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.