Jun 10,2021 18:40

సినీ గేయ రచయిత కందికొండ గిరి ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్కరోజు వైద్యానికే రూ.70 వేలకు పైగా ఖర్చవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న ఆయన కుటుంబ సభ్యులు సాయం కోసం చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్‌ ఆయనకు సాయం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ యాసలో బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండగల మీద ఎన్నో జానపద పాటలు, దేశముదురు, పోకిరి, ఇడియట్‌, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎన్నో చిత్రాలకు కందికొండ గిరి వెయ్యికి పైగా పాటలు రాశారు.