
ముంబయి : కొత్త ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్లో ఇబ్బందులు తలెత్తుతున్న నేపధ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటీ) 15సిఎ, 15సిబి ఫారంలు ఫైలింగ్ చేసే పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించింది. మ్యాన్యువల్ ఫైలింగ్ తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త పోర్టల్లో సమస్యల కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ గడువును ఆగస్ట్ 15 వ తేదీ వరకు పొడిగించినట్లు సిబిడిటి వెల్లడించింది.