Jan 23,2022 07:38

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే 22 లక్షల మంది యువతకు ఐటి రంగంలో ఉద్యోగాలిచ్చేందుకు కృషి చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాద్‌ తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎస్‌పి ప్రభుత్వం ఐటి రంగంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేసిందని అన్నారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్‌ యాదవ్‌ మెయిన్‌పురిలోని కర్హాల్‌ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ప్రవీణ్‌సింగ్‌ ఆరోన్‌, ఆయన సతీమణి సుప్రియలు అఖిలేష్‌ సమక్షంలో ఎస్‌పిలో చేరారు. బరేలీ కాంట్‌ అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్‌ సుప్రియకు ఇచ్చింది. ఇప్పుడు అదే స్థానం నుంచి ఆమె ఎస్‌పి తరపున పోటీ చేయనున్నారు. గతంలో రాజేష్‌ అగర్వాల్‌కు ఆ సీటు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు సుప్రియకు మార్పు చేశారు.