Aug 06,2022 23:16

ప్రజాశక్తి-కనిగిరి: ఆజాదికా అమృత మహోత్సవ్‌లో భాగంగా మండల న్యాయసేవాధికార సంస్థ, గుడ్‌హెల్ప్‌ ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని కోర్టుసెంటర్‌ నుంచి పామూరు బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, సిఐ పాపారావు, కనిగిరి, హనుమంతునిపాడు ఎస్‌ఐలు డి.ప్రసాద్‌, కృష్ణపావని పాల్గొన్నారు. అజాదికా అమృత మహోత్సవ్‌ ప్రాముఖ్యతను ర్యాలీలో విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గుడ్‌హెల్ప్‌ డైరెక్టర్‌ మండ్రు రమేష్‌బాబు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.