Apr 08,2021 09:10

తాడిపత్రి రూరల్‌ (అనంతపురం) : ఎపి లో పరిషత్‌ ఎన్నికలు గురువారం కొనసాగుతున్నాయి. గన్నేవరిపల్లి పంచాయితీలో గన్నేవారిపల్లి కాలనీ 43, 44 పోలింగ్‌ బూత్‌ లలో ఓటర్లు ఆసక్తి చూపలేదు. ఇంతవరకూ ఒక్క ఓటు కూడా ఓటర్లు వేయలేదు. తాడిపత్రిలోని 16 స్థానాల్లో 4 ఏకగ్రీవం కాగా, 12 స్థానాలకు అధికారికంగా టిడిపి పోటీలో లేకపోవడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అంత అంత మాత్రంగానే పోలీసు సిబ్బంది ఉన్నారు.