ప్రజాశక్తి- కాకినాడ కార్పొరేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన పిఉద్యోగులకు చెల్లించాల్సిన పిఎఫ్, డిఎ తదితర ఆర్థిక బకాయాలను వెంటనే చెల్లించాలని విజయవాడ ధర్నా చౌక్‌లో ఉపాధ్యాయుల తలపెట్టిన ధర్నా చౌక్ ను అడ్డుకొని ఉపాధ్యాయులను అరెస్టులు చేయడం బాధాకరమని యుటిఎ ఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఐ.ప్రసాద్ రావు తీవ్రంగా ఖండించారు. బుధవారం కాకినాడ ఇంద్ర పాలెం అంబేద్కర్ సెంటర్ నుంచి కాకినాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన జాగా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ సతీష్‌కు వినతి పత్రం అందించి తిరిగి యుటిఎఫ్ కార్యా లయం చేరుకుని నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. యుటిఎఫ్ నాయకులు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సిఐటి నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రసాదరావు, గౌరవ అధ్యక్షులు టి అన్నవరం, ట్రెజరర్ గణేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను చెల్లించాలని నిరసన చేపడితే అక్రమ అరెస్టు చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కనీసం ఉపాధ్యా యులను కూడా చూడకుండా ఇష్టాను సారం పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చిన్నపాటి కారణాలతో చేస్తున్న సస్పెండ్లు మానుకోవాలన్నారు. డిఎ, బకాయిలను బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు దువ్వ.శేష బాబ్జి, కాకినాడ నాగర అధ్యక్షులు పలివెల వీరబాబు, జిల్లా యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
రాలీ నిర్వహిస్తున్న యుటిఎఫ్, సిఐటియు నాయకులు,