
ప్రజాశక్తి-తాళ్లరేవు పంటకాలువపై దశాబ్దాలుగా ఉన్న భారీ వక్షాలు ప్రైవేటు వ్యక్తుల పరమయ్యాయి. తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ గిడ్ల వారి పేట ఎదురుగా జైభీమ్ పేట సమీపంలో పంట కాలువపై ఉన్న భారీ వక్షాలను ప్రైవేటు వ్యక్తులు ఆదివారం యంత్రాల సహాయంతో నరికి వేసి ఆ కలపను తరలించారు. అయితే దీనిపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తాళ్లరేవులో పలువురు ఆరోపిస్తున్నారు.