బస్టాండ్ ఆక్రమణదారులను ఖాళీచేయమని చెబుతున్న ఆర్‌టిసి అధికారి
ప్రజాశక్తి వార్తకు స్పందించిన ఆర్‌టిసి అధికారులు
ప్రజాశక్తి - కోటనందూరు
ఆక్రమణల చెరలో బస్సు షెల్టర్ అనే శీర్షిక ప్రజాశక్తిలో శనివారం ప్రచురించిన వార్తకు తుని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం. కిరణ్ కుమార్ , అసిస్టెంట్ మేనేజర్ రమణలు స్పందించారు. శనివారం ఆక్రమణదారులతో మాట్లాడి బస్ షెల్టర్ ను ఖాళీ చేయాలని శాఖా పరమైన నోటీసులను జారీ చేశారు. ప్రయాణికులకు సౌకర్యార్థంగా ఉంచిన బస్ షెల్టర్‌లో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు సాగించవద్దని సూచించారు. పోలీస్ స్టేషన్ ఎంపీడీవో కార్యా లయాలు సిబ్బందికి తెలియజేసినట్టు తెలిపారు. కోటనందూరు, కాకరాపల్లి ప్రజాప్రతినిధులతో మాట్లాడడం ఆక్రమణల తొలగించేందుకు సహకరించాలని కోరారు.