Jun 21,2021 20:17

ప్రజాశక్తి - తాళ్లపూడి
మండలంలోని వేగేశ్వరపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆక్రమణలు తొలగించేందుకు సచివాలయ సిబ్బంది సోమవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో పంచాయతీ వీధిలో అక్రమాలు జరిగాయంటూ ఇటీవల జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో సర్పంచి అంగీకారంతో సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి కొలతలు వేస్తూ ఆక్రమణల తొలగింపునకు గుర్తులు వేశారు. ఇటీవల గ్రామంలో డ్రెయినేజీలు, సిసి రోడ్ల నిర్మాణం చేపట్టిన సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటన కూడా జరిగింది. ఇదిలా ఉంటే చిన్న గ్రామాల్లో ఆక్రమణలు తొలగించటం ఒక చారిత్రాత్మక విషయాన్ని ప్రజలు అంటున్నారు.