Mar 25,2023 00:04

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేస్తున్న ప్రవీణ్‌ ప్రకాష్‌

సత్తెనపల్లి రూరల్‌: స్థానిక బీసి బాలికల వసతి గృహాన్ని ,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రఘురాంనగర్‌లోని బీసి ీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసి, విద్యా ర్థినులతో మాట్లాడి వివరాలు తెలుసు కున్నారు. భోజనాన్ని పరిశీలించారు.వార్డెన్‌ కు పలు సూచనలు చేశారు. అనంతరం స్థేషన్‌ రోడ్డులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలి కల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. నాడు-నేడు రెండో విడత పనులను పరిశీలిం చారు. తరగతి గదులను తనిఖీ చేశారు. మెను గురించి, విద్యాలయంలో ఉన్న సౌక ర్యాలపై బాలి కలతో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిలబస్‌ గురించి బాలికలతో, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ప్రవీణ్‌ ప్రకాష్‌కు ఆర్డిఒ రాజకుమారి తహ శీల్దార్‌ కె.నగేష్‌లు పుష్ప గుచ్ఛా లు అందించి స్వాగ తం పలికారు.ప్రవీణ్‌ ప్రకాష్‌ వెంట ఆర్జేడీ విఎ స్‌ సుబ్బారావు, డిఈవో కె.శ్యామ్యూల్‌ ఉన్నారు.