
హైదరాబాద్: బోయినపల్లి కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ మూడురోజుల కస్టడీ గురువారంతో ముగిసింది. అంతకుముందు ఆమెకు కరోనా, ఈసీజీ, గైనిక్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. తర్వాత ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఈనెల 16న అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
ఈ మూడు రోజుల కస్టడీలో.. తొలుత ఏ ప్రశ్న వేసినా తెలియదని సమాధానం చెప్పిన అఖిలప్రియ, పోలీసులు ఆధారాలు చూపడంతో ఒక్కొక్కటీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ భూవివాదాన్ని సానుకూలంగానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోనే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నారని సమాచారం. దీంతో పోలీసులకు కీలక సమాచారమే లభించినట్లయింది. అలాగే కిడ్నాప్ ప్రక్రియనంతటినీ భార్గవ్‌రామ్, జగత్ విఖ్యాత్‌రెడ్డిలు పర్యవేక్షించినట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, గుంటూరు శ్రీనుల కోసం పోలీసులు టీమ్‌లుగా గాలిస్తున్నారు.
హఫీజ్‌పేటలో భూమా నాగిరెడ్డికి చెందిన 33 ఎకరాల భూమికి ఏవీ సుబ్బారెడ్డి బినామీగా వ్యవహరించేవారు. కృష్ణారావు అనే న్యాయవాదిని న్యాయసలహాదారుగా 2005లో నియమించుకున్నారు. కృష్ణారావు మరణం తర్వాత.. ఆ వ్యవహారాలన్నింటినీ ఆయన కుమారుడు ప్రవీణ్‌రావు, మేనల్లుడు సునీల్‌రావులు పర్యవేక్షించేవారు. సదరు భూమికి న్యాయవివాదాలు ఉండడంతో సుబ్బారెడ్డి 2015లో ప్రవీణ్‌రావు సోదరుల నుండి నగదు తీసుకుని బయటకు వచ్చేశాడు. ఈ విషయం కాస్త అఖిలప్రియకు తెలిసి అప్పటి నుండి తమకూ వాటా ఇవ్వాలంటూ ప్రవీణ్‌రావుతో పాటు ఇతర భాగస్వాములపై ఒత్తిడి తెచ్చారు. సయోధ్యకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కిడ్నాప్‌కు ఉపక్రమించారు. ఈ సందర్భంగానే పోలీసులకు దొరికారు.