
ప్రజాశక్తి - ఏలూరు కల్చరల్
అల్లూరి సీతారామరాజు జీవితం ఆదర్శమని ఎవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, కన్వీనర్ ఆలపాటి నాగేశ్వరరావు అన్నారు. పవర్‌పేటలోని అన్నే భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో అల్లూరి ఫొటోలు, ప్రజాశక్తి ప్రత్యేక సంచికలు, అల్లూరి సీతారామరాజు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ అల్లూరి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన యోధుడని అని శ్లాఘించారు. ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు పరిసరాల్లోని 125 విద్యాలయాలు, కవులు, మేధావులతో ఏడాది పాటు సభలు, సమావేశాలు నిర్వహించి అందరిలో చైతన్యం కల్పించే ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 125 విద్యాలయాలకు అల్లూరి ఫొటోలు అందజేస్తామని చెప్పారు. ప్రజాశక్తి అల్లూరి సీతారామరాజు 125వ ప్రత్యేక సంచికలు వెయ్యి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రత్నాకర్‌రావు, కూన కృష్ణారావు, వై.ఆనంద నాయుడు, పి.ఆంజనేయులు, అజరు బాబు, వి.కనకదుర్గ, ఎన్వి.గంగా భవాని, ఎస్ఎన్.కట్టా, కె.మాలతీ దేవి పాల్గొన్నారు.