Jul 04,2022 00:04

అల్లూరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న చిన్నారులు

ప్రజాశక్తి-యంత్రాంగం
అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
గాజువాక : విసిసి ఆధ్వర్యాన పాత గాజువాకలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, సంతోషం, స్వర్ణలత, శశి పాల్గొన్నారు.
పెదగంట్యాడ సిడబ్ల్యుసిలో వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ (విసిసి) ఆధ్వర్యాన జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పాల వెంకయ్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విసిసి కో-ఆర్డినేటర్‌ వి.గణేష్‌, కొవిరి శ్రావణి, సిహెచ్‌ రామ్‌చరణ్‌, కోటి, సిడబ్ల్యుసి కార్యదర్శి పాల శ్రీనివాసరెడ్డి, సిహెచ్‌ రాముడు, వర్షిణి, చంద్రిక, యశ్వంత్‌, హేమంత్‌ తదితరులు పాల్గొన్నారు.
పిఎం పాలెం : గణేష్‌నగర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఎం, సిపిఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, దేశంలో అధికారం చేపట్టిన బిజెపి నేతలు అల్లూరి ఆశయాలకు తూట్లు పొడిచి విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి.సత్యనారాయణ, జి.వెలంజనిరావు, కె.మేగారావు, పి.అప్పలరాజు, సిపిఎం నాయకులు డి.అప్పలరాజు, పి.రాజశేఖర్‌, జి.కిరణ్‌, ఎస్‌.రామప్పడు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం : సీతమ్మధారలో వున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద వైజాగ్‌ చిల్డ్రన్స్‌ క్లబ్‌ మద్దిలపాలెం జోన్‌ ఆధ్వర్యాన అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి చిన్నారులు నివాళులర్పించారు. అల్లూరి ఆశయాలను సాధిస్తాం, విశాఖ ఉక్కు అమ్మొద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, యువతకు ఉద్యోగాలివ్వాలి, విశాఖ ఎక్స్‌ ప్రెస్‌కి అల్లూరి పేరు పెట్టాలి, పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టాలి అంటూ పిల్లలు నినదించారు. ఈ కార్యక్రమంలో జోన్‌ కో కన్వీనర్‌ గీతాంజలి, విసిసి ఆర్గనైజరు నీలవేణి, యశ్వంత్‌, కీర్తన, సూర్య కిరణ్‌, కౌశిక్‌, గౌతమి, వైష్ణవి, షర్మిల, పార్ధు, భవిష్య, మల్లిక పాల్గొన్నారు.