Jul 03,2022 22:26

అల్లూరి జయంతిలో పాల్గొన్న వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు

అల్లూరిపై మాట్లాడే అర్హత బిజెపికి లేదు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
అల్లూరి సీతారామరాజు కోసం మాట్లాడే నైతిక అర్హత బిజెపినాయకులకు లేదని వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతిని వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత నందం గనిరాజు సెంటర్‌ నుంచి కంబాల చెరువు, దేవిచౌక్‌ మీదుగా అల్లూరి విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి విగ్రహానికి నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం పెట్టాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకం ఆపాలని, రైల్వే జోన్‌ ఇవ్వాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని నినదించారు. ఈ సందర్భగా సిపిఎం, సిపిఐ, సిపిఐఎం న్యూ డెమోక్రసీ నాయకులు టి.అరుణ్‌, టి.మధు, జోజి మాట్లాడారు. భారత దేశంలో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు, మన్యంలో బ్రిటిషు తెచ్చిన దుర్మార్గపు చట్టలకు నలిగిపోతున్న ఆదివాసీలా హక్కుల కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఏమాత్రం పోరాటం చెయ్యకుండా బ్రిటిష్‌ వారి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరిన ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన బిజెపి, నేడు అల్లూరి విగ్రహం భీమవరంలో పెట్టి, దాన్ని ప్రారంభించ డానికి మోడీని తీసుకురావడం సిగ్గుచేటైన విషయమ న్నారు. ప్రధాని మోడీ అల్లూరి గురించి మాట్లాడా లంటే ముందుగా బ్రిటిష్‌వారికి అనుకూలంగా పనిచేసినందుకు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అభివద్ధికి, పోలవరానికి నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు రాష్ట్ర ప్రజకు క్షమాపణ చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజ నాల కోసమే ఈ విగ్రహావిష్కరణ జరుగుతుంద న్నారు. విగ్రహాలు పెట్టే పేరుతో అమరవీరుల పోరాట స్ఫూర్తిని నిరుగార్చే పద్ధతిని బిజెపి, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నాయన్నారు. అమర, విప్లవ వీరుల పోరాట స్ఫూర్తి వామపక్ష పార్టీలకు మాత్రమే ఉందన్నారు. ఆ స్ఫూర్తితోనే పోలవరం నిర్వాసితుల కోసం పోరాడుతున్నామన్నారు. ఆదివాసీల పోడు భూముల కోసం, రాష్ట్రానికి నిధుల కోసం పోరాడుతున్నామన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి.రాజులోవ, నాయకులు టిఎస్‌.ప్రకాష్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, పి.వెంకటేశ్వరావు, సావిత్రి, సోమేశ్వరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వి.రాంబాబు, రాజేష్‌, శంకర్‌, జి.భాస్కర్‌, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు, జట్లు లేబర్‌ యూనియన్‌ కార్యదర్శి సప్పా రమణ, కె.దుర్గాప్రసాద్‌ సిపిఐ నగర సహాయ కార్యదర్శి వి.కొండలరావు, బి.రవిచంద్ర, రవణమ్మ, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు చింతలపూడి సునీల్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.