Oct 31,2021 13:23

ఓ వైపు సినిమాలతో.. మరోవైపు సోషల్‌ మీడియాలో నిత్యం బిజీగా ఉంటుంది సమంత. దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. అందుకోసమే ఓ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించింది. అయితే ఇటీవల పరిణామాలతో ఇటు అభిమానులకు... అటు సోషల్‌ మీడియాకు మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. ప్రస్తుతం మరోసారి సామాజిక మాధ్యమాల్లో తనదైన శైలిలో స్పందిస్తూ ఆసక్తికర పోస్టులు పెడుతోంది. ఓ వైపు వెకేషన్‌ని ఎంజారు చేస్తూనే చర్చనీయాంశమైన పోస్టులను పెడుతోంది సమంత. ఆ విశేషాలేంటో చూద్దాం..!

పూర్తిపేరు : సమంత రూత్‌ ప్రభు
ఇతర పేర్లు : యశోద, యశో, సామ్‌
పుట్టిన తేదీ : ఏప్రిల్‌ 28, 1987
పుట్టిన ప్రాంతం : చెన్నరు, తమిళనాడు
చదువు : కామర్స్‌లో డిగ్రీ
హాబీస్‌ : జిమ్మింగ్‌, రీడింగ్‌ బుక్స్‌
ఇష్టమైన నటులు : రజనీకాంత్‌, ధనుష్‌, సూర్య
తల్లిదండ్రులు : జోసఫ్‌ ప్రభు, నైనితీ
సోదరులు : జోనాథన్‌, డేవిడ్‌

చైతుతో విడాకుల అనంతరం సమంత వద్దన్నా వార్తల్లోనే ఉంటుంది. తన ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారంటూ రెండు యూ ట్యూబ్‌ ఛానెల్స్‌పై కేసు పెట్టింది సమంత. అయితే ఇందులో ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాలు.. మరోవైపు సోషల్‌ మీడియాతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది సామ్‌. దీంతో పాటు ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే స్టోరీస్‌ కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్ట్‌ మరోసారి సంచలన కలిగిస్తోంది. ఇది చూసి అభిమానులతో పాటు నెటిజన్లూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చి.. స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో వెకేషన్‌ని ఎంజారు చేస్తోంది. ఇలాంటి సమయంలో పెళ్లి గురించి పెట్టిన పోస్ట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్‌స్టాలో పెళ్లి గురించి, అమ్మాయిల గురించి పెట్టిన పోస్ట్‌ చర్చకు దారితీసింది.

                                              అందులో నిజం లేకపోలేదు..

ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్లకు ఎలా పెళ్లి చేయాలనే విషయంపైనే తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయితే దానిపై కాకుండా వాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించాలని.. పెళ్లి కంటే ముఖ్యమైన విషయాలు మరికొన్ని కూడా ఉన్నాయని చెప్తూ పోస్ట్‌ చేసింది సామ్‌. 'మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారోనని కంగారుపడాల్సిన అవసరం లేకుండా ఆమెను సమర్థంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి రోజు కోసం డబ్బు ఆదా చేసే బదులు, ఆమె చదువుకి ఖర్చు పెట్టండి. ఆమె కోసం ఆమెను సిద్ధం చేయండి. ఆమె కాళ్లపై ఆమె నిలబడేలా చేయండి. మొదట ఆమెను ఆమె ప్రేమించుకోవడం, ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడం నేర్చుకోనివ్వండి.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్ధం చేయండి' అని పోస్ట్‌ పెట్టింది. అమ్మాయిల విషయంలో సామ్‌ పెట్టిన పోస్టుకి చాలామంది సపోర్ట్‌ చేస్తున్నారు. 'అందులో నిజం లేకపోలేదు..!' అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 'బయట సమాజం ప్రస్తుతం అలాగే ఉంది.. అమ్మాయిల పెళ్లి కంటే ముందు జీవితం అంటే ఏంటో నేర్పిస్తూ పెంచాల్సిన అవసరం ఉంది' అని అభిప్రాయపడుతున్నారు.
 

                                             విమర్శలకు ఎదురునిలిచి..

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంతపై ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. సామ్‌ ప్రవర్తన.. వ్యక్తిగత జీవితంపై ఇష్టానుసారంగా కథనాలు వెలువడ్డాయి. దీనిపై పలువురు సినీ ప్రముఖులు సమంతకు మద్దతుగా నిలువగా.. పలువురు నెటిజన్స్‌ మాత్రం సమంతపై తీవ్ర ఆరోపణలు చేశారు.. తాను తప్పు చేయలేదంటూ.. విమర్శలకు ఎదురు నిలిచింది. ప్రస్తుతం కఠిన పరిస్థితులను ఎదుర్కోవడానికి తనకు సమయమివ్వాలని కోరింది. ఇక ఆ తర్వాత సామ్‌ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది.
 

                                                పగటి కలలు మానేయాలి..

ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ముందు తనను తాను మార్చుకుంటానని సమంత అన్నారు. మధ్యాహ్నం వరకూ నిద్రపోవడం కుదరదని, తన పనులు తానే చేసుకోవాలని, ఇంటిని, పడకగదిని శుభ్రం చేసుకోవాలని, పగటి కలలు కనడం మానేసి చేయాల్సిన పనులపై దృష్టిపెట్టాలని సమంత అన్నారు.
 

                                              సేవా కార్యక్రమాల్లోనూ..

ప్రత్యూష ఫౌండేషన్‌ ద్వారా సమంత చేస్తోన్న సేవా కార్యక్రమాల గుర్తించి తెలిసిందే. ఆ మధ్య చాందినీ (5) బాలికకు ఆపరేషన్‌ చేయించడం ద్వారా నడవగలిగేందుకు తన వంతు సాయం చేసింది. అలాగే ఏడాది మొత్తం వంద మంది చిన్నారులకి తమ సంస్థ ద్వారా ఒక పూట భోజనం అందించింది. 'అలా మీరు కూడా మీ వంతు సహాయం అందించి, చిన్నారుల ఆకలి తీర్చాలి!' అని సమంత ట్వీట్‌ ద్వారా తన అభిమానులు, నెటిజెన్స్‌కి విజ్ఞప్తి చేసింది. కరోనా సమయంలోనూ తనవంతు సహకారం అందించింది.
 

                                                నేతన్నలకు అండగా..

కాశ్మీర్‌కి చెందిన దూసల అనే చేనేత వస్త్రాలు నేసే వారికి అండగా నిలిచింది సమంత. అక్కడ ఉన్నన్ని రోజులూ వారు నేసిన డ్రెస్సులనే వేసుకున్న సమంత, తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. అలాగే దూసల నేత కార్మికులకు సపోర్ట్‌ చేయాలని తన ఫాలోవర్స్‌కు పిలుపునిచ్చింది. గతంలో తెలంగాణ చేనేతని కూడా తను ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి అటు కెరీర్‌ పరంగానే కాకుండా పర్సనల్‌గానూ ఎంతో మందికి అండగా ఉంటోన్న ఆమెను చూసి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌ అంతా 'సూపర్బ్‌ సమంత!' అంటూ మెచ్చుకుంటున్నారు.