May 16,2022 18:10

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో బాల్య వివాహం జరిగింది. 12 ఏళ్ల బాలికకు, 35 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగింది. బాలిక తల్లిండ్రులు బర్త్‌డే చేస్తున్నామన్న పేరుతో వివాహం జరిపించారు. దీంతో వారిపై పోలీస్‌ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో.. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు బాలిక తల్లిదండ్రులు పుట్టినరోజు వేడుక పేరుతో వివాహాన్ని నిర్వహించారు. అయితే బాలికు ఈ పెళ్లి ఇష్టం లేదని తన బంధువుల ఇంటికి వెళ్లింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి.. బంధువులతో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బాధిత బాలిక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. ఎట్టకేలకు ఈ విషయం ఐసీడీఎస్‌ అధికారులకు చేరింది. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు పాపిరెడ్డిగూడ చేరుకుని బాధితురాలిని చేరదీశారు. బర్త్‌డే పేరిట పెళ్లి జరిపించారని బాధిత బాలిక గ్రామస్తులకు, ఐసీడిఎస్‌ సిబ్బందికి తెలపడంతో.. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.