Jan 15,2022 17:15

హైదరాబాద్‌ : నటుడిగా, క్రికెటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వ బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌5 లో తన ఆటతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విశ్వ పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా అమెరికా అబ్బాయి పెళ్ళి లొల్లి అనే ఆల్బమ్‌ సాంగ్‌లో నటించడం జరిగింది. ప్రముఖ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ ఆల్బమ్‌ సాంగ్‌ను పాడడం విశేషం. ఇటీవల ఈ సాంగ్‌ పోస్టర్‌ను యువ హీరో ఆకాష్‌ పూరి విడుదల చేశారు. పోస్టర్‌ బాగుందని సాంగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నానని చిత్ర యూనిట్‌ను అభినందించారు. తాజాగా ఈ సాంగ్‌ను ప్రముఖ కొరియోగ్రఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ విడుదల చెయ్యడం విశేషం. సాంగ్‌ రిలీజ్‌ తరువాత చూసిన అందరూ కాన్సెప్ట్‌, మ్యూజిక్‌ ముఖ్యంగా విశ్వ స్టెప్స్‌ బాగున్నాయని అంటున్నారు. రవిగంజం దర్శకత్వంలో రాబోతున్న ఈ సాంగ్‌కు హర్ష గన్నోజి సంగీతం అందించారు, అఖిలేష్‌ కాలారు సాహిత్యం అందించారు, శివ శంకర్‌ వర్మ సినిమాటోగ్రఫీ అందించారు, ఎడిటింగ్‌ శివశంకర్‌ నాగళ్ళ చేశారు. అలాగే అఖిల్‌ కట్ట కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా నిర్మిచారు బిందు అఖిలేష్‌ కలారు.

333

 

44