
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మార్చడానికే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని భావించడమే బైడెన్ చేసిన తప్పని అన్నారు. కానీ.. వాస్తవానికి ప్రజలంతా తక్కువ నాటకీయతను కోరుకున్నారని శుక్రవారం ట్వీట్ చేశారు. అధ్యక్ష రేసులో ఓటమి పాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్ ఖాతాపై నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించిన కొన్ని రోజులకే మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో తక్కువ విభజనవాద అభ్యర్థి బరిలో ఉండటం మంచిదని భావిస్తున్నానని అన్నారు. అయితే ట్రంప్ ట్విటర్ ఖాతాను త్వరలో పునరుద్ధరించాలనుకుంటున్నానని మరో ట్వీట్లో పేర్కొన్నారు. గతేడాది జనవరిలో క్యాపిటల్ భవనంపై అల్లర్ల సమయంలో హింసను ప్రేరేపించారన్న ఆరోపణలపై ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే.