Nov 25,2021 07:21

కాబూల్‌ : దోహాలో అమెరికాతో వచ్చేవారం ప్రారంభించనున్న రెండో విడత చర్చలు ఇరు దేశాల రాజకీయ సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని నెలకొల్పనున్నాయని తాలిబాన్లు పేర్కొన్నారు ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక అంశాలు, గత దోహా ఒప్పందం అమలు జరుగుతున్న తీరు గురించి చర్చిస్తామని తాలిబాన్‌ ప్రతినిధి తెలిపారు. రెండు వారల పాటు జరగనున్న ఈ చర్చలను అమెరికా ప్రతిపాదించింది. అక్టోబర్‌ 9-10 తేదీల్లో ఖతార్‌ రాజధాని దోహలో అమెరికా-తాలిబాన్ల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.