May 13,2022 10:13

అమ్మంటే ... మనకు అనీన సమకూరుస్తుంది. గంటల తరబడి విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. ఇంట్లో ఎవరికీ ఏమి ఇష్టమో తెలుసుకుని మరీ వండి పెడుతుంది. బట్టలు ఉతుకి సర్దిపెడుతుంది. దగ్గరుండి చదివిస్తుంది. ఎవరికైనా బాగోపోతే సపర్యలు చేస్తుంది. మన బాగోగులు చూసుకుంటుంది. మరి అలాంటి అమ్మకి పనిలో సాయం చేస్తే ఆమెకి ఎంతో కొంత విశ్రాంతి ఇచ్చినవారమవుతాం.

  • ఇప్పుడు స్కూలుకు సెలవులే కాబట్టి ఉదయం వంట గదిలో టిఫిన్‌ చేస్తున్న అమ్మకి పాలు, టీ వేడి చేసి ఇవ్వండి. కూరగాయలు తరిగి ఇవ్వండి.
  •  బట్టలు ఉతుకుతుంటే తీసుకెళ్లి బయట ఆరబెట్టండి. గిన్నెలు తోముతుంటే కడికి పెట్టంటి. ఇలా ప్రతి పనిలో ఆమెకి తోడుగా ఉండి పనులు అందుకుంటే సంతోషిస్తుంది.
  •  ఇల్లు శుభ్రంగా చిమ్మి, తడిబట్టతో తుడవండి. చిందరవందరగా పడి ఉన్న వస్తువులు అరమరలో సర్దిపెట్టంటి.
  •  బజారుకు వెళ్లి పాల ప్యాకెట్లు, సరుకులు తెచ్చి పెట్టండి.
  •  మొక్కలకు నీళ్లు పెట్టడం వంటి చిన్న చిన్న పనులు అమ్మ చేతిలో నుంచి అందుకుని చేస్తుంటే అమ్మ సంతోషిస్తుంది.
  •  అమ్మకి ఇష్టమైన వంటలు చేయడం, ఆమెకి నచ్చిన జ్ఞాపకాలు ఓ గిప్టుగా ఇస్తే ఇంకా బాగుంటుంది.