May 09,2021 23:18

తిమ్మాపురం వద్ద ప్రమాద స్థలిలో వృద్ధుని మృతదేహం

ప్రజాశక్తి - గుంటూరు జిల్లావిలేకర్లు : జిల్లాలోని పలు రహదార్లు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో వాటిల్లిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు యువకులు, బాలుడు, వృద్ధుడు ఉన్నారు. బాలుడు, వృద్ధుడు ప్రకాశం జిల్లాకు చెందిన వారు కాగా, ముగ్గురు యువకులు నరసరావుపేట, రొంపిచర్ల మండలాలకు చెందినవారు. కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ విధించి మధ్యాహ్నం 12 గంటల వరకే వాహన రాకపోకలను అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిరోజులుగా రోడ్డు ప్రమాదాలు తక్కువగా ఉన్నాయని భావిస్తుండగా ఒకేసారి ఐదుగురు మరణించడం ఆందోళన కలిగించింది. ఈ ఘటనలు నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, యడ్లపాడు మండలాల్లో చోటుచేసుకున్నాయి.
కేక్‌ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థులు లారీ ఢకొీని మృతి చెందారు. నరసరావుపేట మండలం బసికాపురంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. బసికాపురానికి చెందిన మలతోటి వెంకట్రావు కుమారుడు వెంకీబాబు(19), వేమర్తి సుధాకరరావు కుమారుడు ఏసుబాబు (17) మాతృదినోత్సవం సందర్భంగా కేకు తెచ్చి తమ తల్లులకు తినిపించాలని భావించి ద్విచక్ర వాహనంపై నరసరావుపేటకు బయలుదేరారు. కేసనపల్లి సమీపంలో పెద్ద తురకపాలెం ఈద్‌-గా వద్దకు రాగానే చిలకలూరిపేట వైపు వస్తున్న లారీ విద్యార్థుల ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించి లారీని స్టేషన్‌కు తరలించారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ లకీëనారాయణరెడ్డి కేసు నమోదు చేశారు.
ఆగి ఉన్న లారీని బైకు ఢ కొని యువకుడు మృతి చెందిన సంఘటన అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్రీయ రహదారి మార్గంలో రొంపిచర్ల మండలంలోని వీరవట్నం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. మండలంలోని సంతగుడిపాడు ఎస్సీ కాలనీకి చెందిన జి.నాగేంద్రబాబు (28), కొర్రపోలు యాకోబు ప్రకాశం జిల్లా బండివారిపాలెంలోని బంధువులు ఇంటికి ఉదయం వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరవట్నం సమీపంలోని దద్దనాల ఆంజనేయస్వామి గుడి దాటగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢకొీంది. ద్విచక్ర వాహనం నడుపుతున్న నాగేంద్రబాబు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా వెనక కూర్చున్న కూర్చున్న యాకోబుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ పి.హజరత్తయ్య పోలీసు సిబ్బందితో ఘటనా స్థలిని పరిశీలించారు. మృతని కుటుంబీకులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇదిలా ఉండగా ఇదే ప్రదేశంలో ఇప్పటికే పలుమార్లు ఇదే తరహా ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ టర్నింగ్‌ లేకపోవడం, లారీలు రోడ్డు పక్కన ఆగి ఉండడం, అయినా ప్రమాదాలు వాటిల్లడం గమనార్హం.
ప్రజాశక్తి - వినుకొండ : కారు ఢకొీని బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని విఠంరాజుపల్లిలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం కొనకళ్లమెట్ల మండలం గార్లదిన్నెకు చెందిన భవన నిర్మాణ కార్మికులైన తమ్మిశెట్టి అల్లూరయ్య సరోజిని దంపతులు వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఇంటి నిర్మాణ పనులకు 20 రోజుల కిందట తమ ఇద్దరు కుమరులతో కలిసి వలసొచ్చారు. నిర్మాణం వద్దే చిన్న గుడిసెలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 6 గంటలప్పుడు తమ రెండో కుమారుడైన శ్రీను (8)ను చిల్లర కొట్టుకు పంపించగా రోడ్డు దాటే క్రమంలో గిద్దలూరు నుండి గుంటూరు వెళ్తున్న కారు ఢకొీట్టింది. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాలుణ్ణి స్థానికుల సాయంతో తల్లిదండ్రులు వినుకొండ పట్టణంలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లినా కరోనా నేపథ్యంలో వైద్యం నిరాకరించారు. నరసరావుపేటకు తిసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వారిని అదుపలోకి తీసుకున్నారు.
ప్రజాశక్తి - యడ్లపాడు : ఆటో బోల్తాపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన మండలంలోని యడ్లపాడు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పొదిలి మండలం జూలపల్లికి చెందిన ఆరుగురు కలిసి ట్రాలీ ఆటోలో విజయవాడ నుండి సొంతూరుకు వెళ్తున్నారు. వాహనాన్ని కోనంగి శివయ్య నడుపుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ఆటో తిమ్మాపురం వద్దకు రాగానే అదపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టింది. ఆటో బోల్తాపడ్డంతో శివయ్య తండ్రి నరసయ్య (80) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పి.రాంబాబు తెలిపారు.