May 09,2021 23:22

కరోనా వైరస్‌

ప్రజాశక్తి - అమరావతి : అమరావతి మండలంలో రికార్డు స్థాయిలో ఆదివారం 189 పాజిటివ్‌లు నమోదయ్యాయి. గ్రామాల వారీగా నెమలికల్లు 2, మండెపూడి 17, అత్తలూరు 4, మునుగోడు 15, మల్లాది 14, దిడుగు 21, ధరణికోట 13, లింగాపురం 17, అమరావతి 36, నరుకుళ్లపాడు 15, ఎండ్రాయి 13, లేమల్లె 19, వైకుంఠపురం 1, చావుపాడు 1, ఉంగుటూరు 1, కర్లపూడి 1 చొప్పున నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వీరందర్నీ క్వారంటైన్‌ చేసినట్లు పేర్కొన్నారు. రెండ్రోజుల కిందట 36 పాజిటివ్‌లు రావడమే మండలంలో మొన్నటి వరకూ గరిష్టం కాగా ప్రస్తుతం కొన్ని రెట్లు అధికంగా నమోదవడం గమనార్హం. అయితే గతంలో కొంతమంది ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రభుత్వ రికార్డుల్లో నమోదు తక్కువగా ఉండేదని, ప్రస్తుతం అక్కడ పరీక్ష కిట్లు లేకపోవడంతో అందరూ ప్రభుత్వ కేంద్రాల్లోనే పరీక్షలకు వస్తున్నారని తెలిసింది. ఈ కారణం వల్ల పాజిటివ్‌లన్నీ నమోదై ఆ సంఖ్య ఎక్కువగా ఉన్నా గతంలోనూ అనధికారికంగా ఇదే తరహాలో పాజిటివ్‌లు ఉండేవనే వాదనలు వినిపిస్తున్నాయి.