Oct 05,2022 12:42

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం రూరల్ : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మండల కేంద్రంమైన పెంటపాడులోని ఎస్ టి వి ఎన్ పాఠశాల నుంచి  రెండో రోజు బుధవారం అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగింది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ బాబ్జి ఆధ్వర్యంలో కొనసాగిన ఈ పాదయాత్రకు కే.పెంటపాడు గ్రామంలో మామిడి తోరణాలతో పూర్ణకుంభంతో గ్రామస్థులు స్వాగతం పలికారు. ఓకే రాజధాని - ఒకే రాష్ట్రం, మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పలు గ్రామాల రైతులు భారీగా తరలివచ్చారు. పాదయాత్రకు టీడీపీ, జనసేన, సీపీఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు సంఘిభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.