
శంకుస్థాపనలో మేయర్ సుజాత
ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్ : స్థానిక పదో డివిజన్ కొప్పోలు పరిధిలోని అంబేద్కర్ నగర్‌లో అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణానికి నగర మేయర్ గంగాడ సుజాత శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ దాదాపు రూ.92 లక్షలతో అంబేద్కర్ ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించి ముందుగా రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు వివరించారు. అంబేద్కర్ ఆడిటోరియం నిర్మాణం మంచి పరిణామమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పదో డివిజన్ కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య, 16వ డివిజన్ కార్పొరేటర్ నాగభూషణం, వైసిపి నాయకుడు నాని, కార్పొరేషన్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.