Jul 04,2022 00:03

అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ భవనాన్ని పరిశీలిస్తున్న మంత్రి నాగార్జున

ప్రజాశక్తి -పిఎం పాలెం : రుషికొండ సమీపంలో ఉన్న అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ భవనాన్ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సదుపాయాలు కల్పించేలా అధికారులతో చర్చించినట్లు చెప్పారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకొని వారి భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఆనాడు అంబేద్కర్‌ చదువే ఆయుధం అని చెప్పిన మాటలను నేడు ముఖ్యమంత్రి అనుసరిస్తున్నారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక నాడు- నేడు, అమ్మ ఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టి విద్యాభివృద్ధి కోసం కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ సిబ్బంది పాల్గొన్నారు.