Oct 14,2021 20:24

చిత్రపటాన్ని అందజేస్తున్న మేనేజర్‌ రమణమూరిత

ప్రజాశక్తి- కవిటి/కోటబొమ్మాళి : శరన్నవరాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. జ్ఞాన ప్రదాయిని అమ్మవారిని దర్శించుకునేందుకు యాత్రికులు భారీగా తరలిరాగా... గురువారం జిల్లాలోని పలు ఆలయాలు సందడిగా మారాయి.
కవిటి మండలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి, కవిటి, గొంద్యాలపుట్టుగ, రాజపురం, బల్లిపుట్టుగ, కుసుంపురం, మాణిక్యపురం, తదితర గ్రామాల్లో యాత్రికులు అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కొత్తమ్మతల్లిని దర్శించుకున్న సీదిరి శ్రీదేవి
కోటబొమ్మాళిలోని కొత్తమ్మతల్లిని మంత్రి సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి గురువారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ సంప్రదాయ ప్రకారం ఆలయ మేనేజరు ఎస్‌వి.రమణమూర్తి, ఉత్సవ కమిటీ సభ్యులు లఖినాన కరుణాకర్‌, కె.మల్లయ్య, పురోహితులు గణపతిశర్మ, లక్ష్మీకాంతం శర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కొత్తమ్మతల్లి విశిష్టతను ఆమెకు వివరించారు. ఆమె వెంట వైసిపి నాయకులు ఉన్నారు.
పాలకొండ రూరల్‌ : పట్టణంలో శ్రీకోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేగిడి జెడ్‌పి టిసి సభ్యులు పాలవలస ఇందుమతి దర్శించుకున్నా రు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి.రమణమూర్తి ఆమెకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీప్రసాద్‌ శర్శ ప్రత్యేక పూజలు నిర్వహించారు.