Jul 03,2022 22:33

ప్లీనరీలో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి

ప్రజాశక్తి -కొవ్వూరు రూరల్‌
వైసిపి హయాంలో పార్టీలతో సంబంధం లేకుండా లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎంపీ, వైసిపి ప్రాంతీయ సమన్వయ కర్త పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. ఆదివరం హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అధ్యక్షతన ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మిథున్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జగన్‌ పాలనలో మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని, ఇదే వారికి సమాధానమన్నారు. ఈ విషయంలో గుజరాత్‌ కూడా వెనుకబడి ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అనంతరం హోం మంత్రి తానేటి వనిత, బిసి సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్‌. వేణుగోపాలకృష్ణ, ఎంఎల్‌ఎలు జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకటరావు, సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా కొద్దికాలం క్రితం ద్వారాకా తిరుమల మండలంలో హత్యకు గురైన పార్టీ కార్యకర్త గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులకు పార్టీ తరుపున మిథున్‌రెడ్డి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కార్పొరేషన్ల చైర్మన్లు, సర్పంచులు, ఎంపిటిసి సబ్యులు. సొసైటీ అధ్యక్షులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.