May 15,2022 01:11
గృహ పత్రాలను పంపిణీ చేస్తున్న బాచిన కృష్ణ చైతన్య

ప్రజాశక్తి -మేదరమెట్ల
అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా అభివృద్ధి కావాలని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పిఎంజివై ద్వారా లబ్ధిదారులకు మంజూరు అయిన గృహ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఊరికి ఇద్దరు, ముగ్గురికి ఇండ్ల స్థలాలు ఇస్తే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న కాలనీల పేరుతో ఊర్లకు ఊర్లే నిర్మిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విభిన్న సంక్షేమ పథకాలు రూపొందించి ప్రతి నెల లక్షలాది మందికి కోట్లాది రూపాయలు వారి ఖాతాలకే జమ చేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేశారన్నారు. మాజీ శాసన సభ్యులు గరటయ్య మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో అందరి అభివృద్ధికి శ్రమించే జగన్‌ మోహన్‌రెడ్డికి అందరూ అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ టి వెంకటరమణ, మండల కన్వీనర్‌ సాధినేని మస్తాన్‌రావు, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు జంపు హరిబాబు, స్థానిక సర్పంచ్‌ విజయకుమార్‌, హౌసింగ్‌ డిఇ శర్మ, ఏఇ నటరాజ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.