Sep 20,2023 00:19
మాట్లాడుతున్న కనిగిరి డిఎస్‌పి రామారావు

ప్రజాశక్తి-పామూరు: రాజకీయాలకు అతీతంగా ఐక్యం గా ఉండాలని కనిగిరి డిఎస్‌పి ఆర్‌ రామరాజు అన్నారు. మంగళవారం సిఐ కార్యాలయంలో అన్ని రాజకీ య పార్టీల నాయకులు హిందు ముస్లిం కులపెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి రామారావు మాట్లాడుతూ చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించినా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినా వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సురేష్‌యాదవ్‌తోపాటు ముస్లింపెద్దలు ఖాదర్‌బాషా, గౌస్‌బాషా, రియాజ్‌, కొండలు, నీరుకట్టు నాయబ్‌ రసూల్‌, ఆకుపాటి వెంకటేష్‌, ఏడుకొండలు పాల్గొన్నారు.