Oct 14,2021 17:57

ప్రజాశక్తి -కడప అర్బన్‌
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నవ రత్నాల పథకాలతో పాటు, దశ పథకం జగనన్న చీకటి పథకం ప్రవేశ పెట్టారని టీడీపీ కడప నియోజకవర్గ ఇన్చార్జి అమీర్‌ బాబు ఎద్దేవా చేశారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బగ్గు కొరత వల్ల విద్యుత్‌ సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. దీనిని కప్పి పుచ్చుకోవడం కోసం మిగిలిన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉందని జగన్మోహన్‌ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. కేవలం జగన్మోహన్‌ రెడ్డి ముందు చూపు కొరవడటం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లబోతోందని విమర్శించారు. ట్రూఅప్‌ చార్జీల పేరుతో గత రెండు నెలలుగా వినియోగదారుల నుంచి అధిక విద్యుత్‌ చార్జీలు వసూలు చేశారని పేర్కొన్నారు. ఈరోజు హైకోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవంతో మరల ప్రజల నుంచి విషయాలు సేకరిస్తామని చేస్తామని, అప్పటివరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. అయితే ఈ రెండు నెలలుగా వసూలు చేసిన ట్రూఅప్‌ చార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు.గత రెండు సంవత్సరాల్లో విద్యుత్‌ బహిరంగ మార్కెట్లో యూనిట్‌ ఛార్జ్‌ రూ.3.12పై. దొరుకుతూ ఉంటే, బయట మార్కెట్‌ లో రూ.6 నుంచి రూ.11 వరకు కొనుగోలు చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతూన్నారని విమర్శించారు.
అదే విధంగా బగ్గు కొరత కారణంగా ఇంట్లో ఏసీ లు ఆపుకోండి అని సజ్జల రామకఅష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటు, హాస్యాస్పదం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఇచ్చారని పేర్కొన్నారు. సింగరేణికి చెలించాల్సిన బకాయిలు చెల్లించి బగ్గును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రెండు సంవత్సరాలుగా 7 ఉత్పత్తి కేంద్రాలను మూసి వేయడం అని పేర్కొన్నారు.
విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి రెండు భారీ పరిశ్రమలు తీసుకురానుంది,.ఒకటి కొవ్వొత్తుల పరిశ్రమ, రెండవది అగ్గిపెట్టెల పరిశ్రమ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సానపురెడ్డి శివకొండారెడ్డి, జలతోటి జయకుమార్‌, కడప పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, కడప పార్లమెంట్‌ అధికార ప్రతినిధి అమూరి బాలదాసు, టి.ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, బండి జయశేఖర్‌, సి.ఎస్‌.నాసర్‌ అలీ, కొండా సుబ్బయ్య, అనిల్‌, కొమ్మలపాటి, సాధక్‌, ఖళీళ్‌, ఛాన్‌ బాష పాల్గొన్నారు.