Nov 24,2021 08:51

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన
ఒంగోలు జిల్లాలో
అసమాన ధైర్యశాలి
ప్రకాశం జనియించె

పుట్టుకతో దారిద్య్రం
చిన్ననాడె తండ్రి మరణం
అతని చదువు నడ్డలేదు
కృషితో ఉన్నతుడయ్యే

మిత్రుల ప్రోత్సాహంతో
బారిష్టర్‌ చదువు చదివె
రాజమండ్రి, మద్రాసులో
న్యాయవాదిగా చేసే

ఆర్జించిన యావదాస్తి
దేశానికి ఖర్చుచేసె
ధైర్యసాహసాలతో
స్వాతంత్య్ర సమరం చేసె

ఉప్పు సత్యాగ్రహము
క్విట్‌ ఇండియా పోరాటం
అన్నింటా పాల్గొనెను
జైలు శిక్ష అనుభవించె

సైమన్‌ గోబ్యాక్‌ అంటూ
గుండుకు గుండెను చూపెను
ఆ ధైర్యమే అతనిని
ఆంధ్రకేసరిగ చేసెను

రెవెన్యూ మంత్రి గాను
ముఖ్యమంత్రి గా తాను
ఎన్నో సేవలు చేసీ
సంస్కరణలు చేపట్టె

ప్రకాశం బ్యారేజీ
విశ్వవిద్యాలయాలు
ఎన్నో అభివృద్ధి పనులు
అలవోకగ చేపట్టే

నిరుపమాన త్యాగగుణం
ఎనలేని ధైర్యగుణం
అతని సహజ లక్షణాలు
అవే మనకు ఆదర్శం

- రావిపల్లి వాసుదేవరావు
94417 13136