Jun 23,2022 22:08

వాషింగ్టన్‌ : రికార్డు స్థాయిలో అమెరికా మిలటరీ బడ్జెట్‌ పెంపునకు అమెరికన్‌ సెనెట్‌ ఆమోద ముద్ర వేసింది. రక్షణ రంగ వ్యయానిు 3700కోట్ల డాలర్లు పెంచాలనిఅధ్యక్షుడు బైడెన్‌ చేసిన ప్రతిపాదనకు అమెరికా ఆర్మ్డ్‌సర్వీసెస్‌ కమిటీ బుధవారం మద్దతిచ్చింది. సెనెట్‌ ఆమోదంతో మొత్తంగా వచ్చే ఏడాది అమెరికా రక్షణ రంగ బడ్జెట్‌ 81వేల కోట్ల డాలర్లకు మార్గం సుగమం అయింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ, సెనెట్‌లు కలిసి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయి. ఇంకా ఆ తేదీ ఖరారు కావాల్సివుంది. నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌ (ఎన్‌డిఎఎ)కు చేసిన సవరణకు ఆర్మ్డ్‌ సర్వీసెస్‌ కమిటీలో అనుకూలంగా 42ఓట్లు రాగా, 17మంది వ్యతిరేకించారు. ఇదే కమిటీలోని కొంతమంది డెమోక్రాట్లు, రిపబ్లికన్లు మిలటరీ బడ్జెట్‌ను మరికొంత పెంచాలని కోరారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటును నేపథ్యంలో పైగా ద్రవ్యోల్బణం గత 40ఏళ్ళలో ఎనుడూ లేనంత అధిక స్థాయికి 8.5శాతానికి చేరిన పరిస్థితుల్లో ఈ సైనిక వ్యయానిు రికార్డు స్థాయిలో పెంచుతునాురు. ప్రధానంగా నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి కూడా అమెరికన్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతునాురనినివేదికలు అందుతునాుయి. ఇటువంటి సమయంలో ఈ చర్య తీసుకోవడం వల్ల వెంటనే ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం లేనప్పటికీ ఏడాదిలో పూర్తి పర్సంటేజీ పాయింట్‌ తగ్గే అవకాశం వుందనిఆర్థికవేత్తలు అంచనా వేస్తునాురు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు పలు ఆంక్షలను రష్యాపై విధించడమే అమెరికా, యూరప్‌ల్లో ద్రవ్యోల్బణం పెచ్చరిల్లడానికి ప్రధాన కారణంగా వుంది.

  • ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తాం

తీవ్రంగా నష్టం జరగకుండా ద్రవ్యోల్బణాన్ని  తగ్గించేందుకు సెంట్రల్‌ బ్యాంక్‌ కృషి చేస్తోందని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అధ్యక్షుడు జెరోమ్‌ పావెల్‌ తెలిపారు. అయితే ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే అవకాశం వుందనాురు. అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు గణనీయంగా వుంటాయని తెలుసు, ముఖ్యంగా ఆహారం, రవాణా, హౌసింగ్‌ భారాలు మరింత పెరుగుతాయని అన్నారు, అందుకే ముందుగా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంపైనే దృష్టి పెట్టామన్నారు.

  • గ్యాస్‌ పన్నును 90 రోజులు ఆపండి

ఫెడరల్‌ గ్యాస్‌ పన్నులను 90 రోజుల పాటు నిలుపు చేయాలని అధ్యక్షుడు బైడెన్‌ బుధవారం కాంగ్రెస్‌ను కోరారు. అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారని అన్నారు. 18 సెంట్ల పన్నును నిలుపు చేయడం ద్వారా మనం కుటుంబాలకు కొద్దిగా ఉపశమనం కలిగించగలుగుతామని అన్నారు. ఈ మొత్తం వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన గ్యాస్‌ కంపెనీలను కోరారు. ఇది లాభాలు ఆర్జించే సమయం కాదని వ్యాఖ్యానించారు.