Jun 10,2021 12:40

నైఫిడో : ఫిబ్రవరిలో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాని చేజిక్కించుకునేంత వరకు మయన్మార్‌కు నాయకత్వం వహించిన అంగన్‌ సాన్‌సూకి మరిన్ని అభియోగాలు ఎదుర్కోనున్నారు. గతంలో లైసెన్స్‌ లేని వాకీటాకీ వాడారని, కరోనా వైరస్‌ ఆంక్షలను ఉల్లంఘించారని, వలస రాజ్యం, అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న అభియోగాలపై విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆమె అధికారాన్ని వినియోగించి అవినీతికి పాల్పడినట్లు అవినీతి నిరోధక కమిషన్‌ దర్యాప్తులో దోషిగా తేలినట్లు వార్తా పత్రిక గ్లోబల్‌ న్యూ లైట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమెపై అవినీతి వ్యతిరేక చట్టం సెక్షన్‌ -55కింద చర్యలు తీసుకుంటున్నట్లు పత్రిక పేర్కొంది. మాజీ అధ్యక్షుడు యాంగాన్‌ రీజన్‌ నుండి బంగారాన్ని తీసుకున్నట్లు, ఆమె అధినేతగా ఉన్న ఫౌండేషన్‌ కోసం అనేక భూములు, ఆస్తులు లీజుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని కమిషన్‌ ఆరోపించింది. కాగా, మయన్మార్‌లో తిరుగుబావుటా ఎగుర వేసిన జుంటా సైన్యం.. ఫిబ్రవరిలో అధికారాన్ని సూకీని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండి సూకీతో పాటు మరికొంత మంది అధికారులు సైన్యం అధికారంలోనే ఉన్నారు.