Jun 11,2021 21:06

ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రత్యూషకి వినతిపత్రం ఇస్తున్న అంగన్‌వాడీలు

పోరుమామిళ్ళ :నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ఐసిడిఎప్‌ కార్యాలయంలో సూపర్‌వైజర్‌ ప్రత్యూషకి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 1975లో ఐసిడిఎస్‌ ఏర్పడిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలీచాలని జీతాలతో ఐసిడిఎస్‌లో పని చేస్తున్న అంగన్వాడీలను అర్ధాంతరంగా తొలగించేందుకు సహకరించే నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని వారు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ సెంటర్‌లను ప్రాథమిక పాఠశాలలో విలీనాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. లేనిపక్షంలో పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తం గా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో అంగన్వాడీ అధ్యక్షులు విజయమ్మ పోరుమామిళ్ల సెక్టార్‌ లీడర్‌ జ్యోతిమ్మ, పావని పాల్గొన్నారు.