Aug 18,2022 20:54

సిడిపిఒకు వినతి అందిస్తున్న అంగన్వాడీలు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి- కొత్తవలస : అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సెల్‌ ఫోన్లు ఇవ్వాలని కోరుతూ సిఐటియు జిల్లా కమిటీ నాయకులు గాడి అప్పారావు ఆధ్వర్యాన అంగన్వాడీలు సిడిపిఒ రొంగలి ఉమాకు గురువారం వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అనేక రకాల యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లు సక్రమంగా పనిచేయడం లేదని, దీనివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ప్రతి రోజూ లబ్ధిదారులతో బయోమెట్రిక్‌ వేయించాలని, లేని పక్షంలో తమ వేతనాల నుంచి జీతం కట్‌ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2017లో నాసిరకం ఫోన్లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నమన్నారు. 15 రోజుల్లోగా కొత్త సెల్‌ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు పాల్గొన్నారు.
రామభద్రపురం : అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వాలని కోరుతూ గురువారం ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ పద్మావతికి సిఐటియు నాయకులు పి.శంకరరావు, బి.శ్రీను ఆధ్వర్యాన వినతి అందించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సిహెచ్‌.లక్ష్మి, పి.లక్ష్మి, హేమలత తదితరులు పాల్గొన్నారు.