Jan 17,2022 22:15

విజేతలతో అథిథులు

ప్రజాశక్తి-దేవనకొండ : అంతర్‌ రాష్ట్ర వాలీబాల్‌ టోర్నమెంట్‌ విజేతగా అనంతపురం జట్టు నిలిచింది. పంచాయతీ కార్యాలయంలో సంక్రాంతి సందర్భంగా ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా వాలీబాల్‌ టోర్నమెంట్‌ జరిగింది. పోటీల్లో 26 జట్లు పాల్గొన్నాయి. సోమవారం జరిగిన ఫైనల్‌లో బెంగళూరు జట్టుపై అనంతపురం జట్టు జయభేరి మోగించింది. విజేత అనంతపురం జట్టుకు రూ.30 వేల బహుమతిని సచివాలయ ఉద్యోగులు, వెంకట సాయి ఫర్టిలైజర్స్‌ వేణు, రవీంద్రలు అందజేశారు. రెండో బహుమతి బెంగళూరు జట్టుకు రూ.20 వేలు ఎస్‌ఐ శ్రీనివాసులు, ఎఎస్‌ఐ శ్రీనివాసులు అందజేశా రు. మూడో బహుమతి కర్నూలు జట్టుకు రూ.10 వేలు ఆర్మీ రామాంజనేయులు, నాలుగో బహుమతి దేవనకొండ జట్టుకు రూ.5 వేలు బొడ్డు నాగరాజు ప్రదానం చేశారు. నిర్వాహకులు మాదన్న, సాయి, చిన్న రంగా పాల్గొన్నారు.