
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని భారత్ మరోసారి పొడిగించింది. ఈ మేరకు డిజిసిఎ ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలను పొడిగిస్తున్నట్లు తెలిపింది. గతంలో ఈ నెల 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ నుండి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఫిబ్రవరి 28 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని డిజిసిఎ పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ రాక ముందు కరోనా అదుపులో ఉండటంతో గతేడాది డిసెంబర్ 15 నుండి విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలని కేంద్రం భావించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాల్లో కేసులు ఉధృతి అధికంగా ఉంది.