Mar 25,2023 00:06

ఎ ఎన్‌ యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు,ప్రాచ్య భాషా విభాగం ఆధ్వర్యంలో 'అనిశెట్టి - పినిశెట్టి సాహిత్యం - సామాజిక దక్కోణం'అనే అంశం పై యు జి సి రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభ సభలో విసి పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం ద్వారా సామాజికంగా ఏంతో మార్పుకు కృషిి చేసిన అనిశెట్టి- పినిశెట్టి లకు సంబంధించిన ఈ సదస్సు నిర్వ హించడం ద్వారా వారి భావ జాలాన్ని సమాజానికి మరింత చేరువ చేసినట్లు అవుతుందని అన్నారు. వారి సాహిత్య విలు వల్ని ఈ రెండు రోజుల జాతీయ సదస్సులో భాగంగా సమ గ్రంగా వారి వారి వ్యక్తిత్వ సందర్శనం నూతన దృష్టి కోణంలో ఆవిష్కృతమౌతుందని భావిస్తున్నానని అన్నారు. రెక్టార్‌ ఆచార్య పి. వరప్రసాద్‌ మూర్తి, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సి పాల్‌ సి. హెచ్‌. స్వరూపరాణి మాట్లాడారు. అనిశెట్టి కుమా రుడు విశ్రాంత అంగ్లోపన్యాసకులు శాంత కుమార్‌ మాట్లా డుతూ తన తండ్రి నాటక సాహిత్యం సినీ సాహిత్య జీవితం పై పరి శోధన చేసిన సుబ్బారావు, ఈనాడు ఈ సదస్సు నిర్వ హిస్తున్న విశ్వవిద్యాలయం వారు అభినంద నీయులని తన తండ్రిలోని ఉన్నత విలువలను వివరించారు. విభాగ శాఖా ధ్యక్షులు డా ఇ. మాధవి లు పాల్గొన్నారు.