
ర్యాలీ చేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి - సీతానగరం : మండలంలోని అనంతరాయుడుపేటలో టిడిపి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బి.చిరంజీవులు మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు పెరిగాయన్నారు. రైతులు పండించే ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయని, సామాన్యుల బతుకులు దుర్భరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కార్యక్ర మంలో టిడిపి మండల అధ్యక్షులు కార్యదర్శులు కె.తిరుపతిరావు, ఆర్.వేణునాయుడు, మండల నాయకులు బి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, వి.సూర్యనారాయణ, డి.సింహాచలం, నాయకులు జి.వెంకటనాయుడు, పి.ఉమామహేశ్వరరావు, సింహా చలం, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.